శివుడు శ్మశానంలోనే ధ్యానం చేస్తాడు
భగవంతునిపై విశ్వాసం, భక్తితోనూ దైవాన్ని పూజించకపోతే దురదృష్టం వెంటాడుతుంది.
శివశక్తి మంత్ర సాధన #Omkaramguruji (ఈశ్వరుడీ మంత్ర సాధానతో సకల సమస్యలు తొలిగిపోతాయి)
కొంత మంది ఏదో ఆశించి స్వార్థంతో దేవుడిని స్మరిస్తారు. ప్రపంచమంతా మాయతో నిండి ఉందని, చావు పుట్టుకలు చక్రంలా తిరుగుతుంటాయని తెలుసుకోలేరు. తనువు చాలించిన తరువాత అది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మకు మాత్రం మరణం లేదు. మనిషి అంతిమంగా చేరే ప్రదేశంలోనే శివుడు నివసిస్తాడు.
అసలు సృష్టి స్థితి లయకారుడైన శివుడు శ్మశానంలో ధ్యానం వెనుక కఠోర వాస్తవం ఉంది. శరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమైన తర్వాత మిగిలే బూడిదను ఒంటికి రాసుకుని, కపాలమాలను శివుడు మెడలో ధరిస్తాడు. విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించడమనేది సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తాడని అర్థం. ఆయనకు విషమైనా, అమృతమైనా సమానమే.
శివుని వెంట ఉండే భూతగణాలు వికృత రూపంలో ఉంటాయి. వాటి శరీరం నుంచి అవయవాలు బయటకు వచ్చి భయంకర ఆకారంలో ఉంటారు. నిజమైన శివ భక్తులు వీటిని చూస్తే భయపడరు. ఈ గణాలు నిరంతరం శివుడితోనే ఉంటాయి కాబట్టి మహాదేవుడిని ఆరాధించే ముందు వీటి పట్ల భయాన్ని వీడాలి. అంటే శివుడికి శ్మశానమైనా, ఆలయమైనా ఒకటే.