సాలగ్రామము ఒకవిధమైన శిలాజాతికి చెందినది. యావత్ ప్రపంచము నందు ఈ విధమైన శిలలు రెండు స్థలముల యందు తప్ప ఇంక ఎక్కడా దొరకవు. ఒకటి నేపాల్ నందు ఖాట్మండు నగరమునకు ఉత్తరమున గండకీ నది తీరమున ముక్తినాధమను పేర ప్రసిద్ధమై ఉన్నది సాలగ్రామక్షేత్రం. ఈ నది నుండి సాలగ్రామములు తీయుదురు. దీనిని నారాయణీనది అని అందురు. రెండోవది హిందూ దేశము నందలి నర్మదా నది యందు దొరుకును.
ముత్యము ఏ విధముగా ఒక పురుగు నుండి తయారగునో అదేవిధముగా ఈ సాలగ్రామం కూడా ఒక పురుగు నుండి తయారగును. 1000 సంవత్సరములు గడిచిన తరువాత ఇది గట్టిపడి శిల వలే తయారగును. ఈ విధముగా శిల వలె తయారైన తరువాత దీనికి చెకుముకి రాయి గుణములు వచ్చును. ఈ గుణము రావడానికి ముందు ఇది సున్నపు (calcium ) అంశమును కలిగి ఉండును.
సాలగ్రామము నిజమునకు రాయిగా మారిన సముద్రజీవి . ఇది " జురాసిక్ టెతీన్ " కాలమునకు చెందినది. సంస్కృత భాషలో సాలగ్రామం అను మాటకు "శిలగా మారిన శలభము" అని అర్థం కూడా ఉన్నది. రుద్రాక్ష ఎంత పెద్దది అయితే అంత మంచిది . సాలగ్రామము ఎంత చిన్నదైన అంత మంచిది . ఇట్లు అనేక సంవత్సరముల అనంతరం ఇది ఒక ఆకారమునకు వచ్చిన పిదప దీనికి ఔషధ గుణములు వచ్చును. దీనికి ఉదాహరణగా టెంకాయ గురించి చెప్తాను. టెంకాయ లేతకొబ్బరి నీరు నందు ఒక గుణం ఉండును. కాయ అయిన తరువాత మరియొక గుణం వచ్చును. ఇది ప్రకృతి నియమం. ఇదేవిధముగా సాలగ్రామమునకు కూడా అనేక వేల , లక్షల సంవత్సరాల తరువాత ఈ ఔషధోపయుక్త గుణములు వచ్చును.
ఈ గుణమును నీటితో అభిషేకించు సమయము నందు ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఆక్టివిటీ నీటియందు ప్రవేశించును. ఆ అభిషేకపు నీటిని మనము తీర్థపు నీటిగా స్వీకరిస్తాము. దీనితో సాలగ్రమము నందు గల ఔషధోపయుక్త గుణము కలిగిన నీటిని మనము స్వీకరించినట్లుగా అగును.
సాలగ్రామము పూజ చేయుటకు పెద్దపెద్ద మంత్రాలు పాటించవలసిన అవసరం లేదు . కేవలం " ఓం నమో నారాయణాయ నమః " అను మంత్రము పఠిస్తూ అభిషేకం చేయవచ్చు. శుభ్రముగా స్నానం ఆచరించిన పిదప రెండు చిన్న పాత్రలలో నీరు నింపి ఉంచుకొనవలెను. వాని యందు తులసీదళములను వేసి భక్తిశ్రద్ధలతో "ఓం నమో నారాయణాయ నమః" అంటూ మట్టిపాత్రలను ముట్టి జపించవలెను. తర్వాత శంఖంతో ఆ నీటిని తీసుకుని నారాయణ మంత్రంతో సాలగ్రామమును అభిషేకించవలెను . మొదటిపాత్రతో అభిషేక తీర్థమును పారబోయవలెను. రెండోవమారు రెండొవపాత్రలోని నీటితో అభిషేకమాచరించిన నిర్మల తీర్ధం అగును. దానిని శంఖముతో దేవునికి అర్పించి తాను స్వీకరించవలెను.
తర్వాత మరలా రెండుపాత్రల యందు నీరు నింపి ఒకదానిలో గంధం , పుష్పములు , తులసి మొదలగు వానిని వేయవలెను. మరియొక దానియందు తులసి మాత్రమే వేయవలెను . గంథం వేసిన నీటిని గంధోదకం అందురు. మరియొకటి శుద్ధోదకం. మొదట సంకల్పము " భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత లక్ష్మీనారాయణ స్య పూజాఖ్యంకర్మ కరిష్యే" అని చెప్పి పూజను ప్రారంభించవలెను. ఘాంటానాదము గావించి శంఖము నందు నీరు నింపి పుష్పములు , తులసి ఉంచి 8 మార్లు " ఓం నమో నారాయణాయ " అని జపించి నీటిని ప్రతిమలకు , తనకు మొదలు అన్నింటికి ప్రోక్షణం చేసుకొనవలెను . దీనితో మనం పవిత్రులమగుదుము .
నల్లగా నిగనిగా మెరిసే ఈ అతినున్నటి రాళ్లకు చిన్నరంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి చూచినప్పుడు లొపల కొన్ని యంత్రాల వంటి గీతలు ఉంటాయి. ఆ రాళ్లను అడ్డంగా సమంగా రెండుచెక్కలుగా కోసి చూస్తే ఆయా దేవతలకు సంబంధించిన యంత్రాలు స్పష్టంగా కనిపిస్తాయని , కొంత బంగారం కూడా ఉంటుందని పెద్దలు చెప్తారు. లోపలనున్న యంత్రాలను బట్టి ఆయా సాలగ్రామాలను ఆయాదేవతలకు మూర్తులుగా భావించి ఆరాధిస్తారు. మిక్కిలి బరువుగాను , బలిష్టంగానూ ఉండే ఈ శిలలను పగలగొట్టకుండానే లోపలి యంత్రాలను గుర్తిస్తారు. ఈ సాలగ్రామాలకు అడుగున పైనా రాగిలోహాన్ని ఉంచితే గనుక అవి నిజమైన సాలగ్రామ శిలలు అయితే ప్రదిక్షణ క్రమంలో కదులుతాయి.
ధనుర్మాసం నందు సాలగ్రామ పుజ చేయుట వలన సర్వపాపాలు హరిస్తాయి.
It is a long established fact that reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum