తలతిప్పు రోగం ( vertigo ) నివారణా యోగాలు –

OMKARAM GURUJIAstrology

తలతిప్పు రోగం ( vertigo ) నివారణా యోగాలు –

0 Comments

ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇది పూర్తిగా పైత్యసంబంధ సమస్య. మన చుట్టూ ఉన్న భూమి తిరిగిపోతున్నట్టు బ్రాంతి కలుగుతుంది . కొంతమందికి పొద్దున్నే నిద్రలేవగానే ఈ సమస్య కలుగుతుంది . దీన్ని ఆంగ్లము నందు VERTIGO or DIZINESS అని పిలుస్తారు .

నివారణా యోగాలు –

  • నిమ్మకాయ రసంలో జీలకర్ర నానబెట్టి మరలా ఎండబెట్టాలి .మరలా నానబెట్టి ఎండబెట్టాలి .ఈ విధానాన్ని ఆయుర్వేదంలో భావన చేయడం అంటారు. ఇలా 7 రోజులపాటు చేసిన తరువాత ఉదయాన్నే ఒక గ్రాము నుంచి రెండు గ్రాముల చొప్పున తినుచున్న తలతిప్పు రోగం నశించును.
  • చిన్న అల్లం ముక్క కి ఉప్పు కలిపి బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్న ఈ సమస్య తీరును . ఉదయం పూట పరగడుపున చేయవలెను .
  • అల్లం రసం ఒక స్పూన్ , నిమ్మరసం ఒక స్పూన్ , తేనె ఒక స్పూన్ కలిపి ఉదయాన్నే పరగడుపున ప్రతినిత్యం సేవించుచున్న తలతిప్పు రోగం నశించును. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులువుగా ఉంటే దానిని పాటించండి. ముఖ్యంగా టీ , కాఫీ పూర్తిగా నిషిద్దం. ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . గమనిక – నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *