మహాభారతం పేరు వినగానే ముందుగా మనకు స్ఫురించేది వ్యాసభగవానుడు. తరువాత భీష్ముడే. నేడు భీష్మ ఏకాదశి. ఆ మహిమాన్వితుడుకు ఉత్తరక్రియలు జరిపింది ఏకాదశి నాడు. శ్రీకృష్ణుడు భీష్ముడుపైన ఉన్న మమకారంతో ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ప్రకటించారు. భీష్ముడు అష్టమి తిథి రోజునే నిర్యాణం చెందారు. ఆరోజు భీష్మాష్టమి అయింది. భీష్ముడు తన తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం వరం కార ణంగా, ఆయన కోరుకొన్నట్టుగా, ఉత్తరాయణం వచ్చే వరకు, దాదాపు ఏభైఎనిమిది రోజులు అంపశయ్య పైనే ఉండి, ధర్మరాజుకు రాజధర్మాలు, ధర్మమార్గం, వంటి ఎన్నో విషయాలు బోధించి, ధర్మప్రబోధకుడుగా భారత చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు. కురుక్షేత్ర యుద్ధం సమాప్తమయిన తదుపరే జ్ఞాన యజ్ఞం మొదలయ్యింది. కురుక్షేత్ర సంగ్రామంలో పదవ రోజున యుద్ధం లో శిఖండి వేసిన బాణపరంపర వల్ల భీష్ముడు నేలపై పడబోతుం డగా, కురువంశ శ్రేష్ఠుడు, జ్ఞానప్రదాత అయిన భీష్ముడుకు అర్జునుడు అంపశయ్య ఏర్పాటు చేసాడు. భీష్ముడు కర్మయోగి. పితృభక్తి పరాయణుడు.
అసలు ఆయన పేరు దేవవ్రతుడు. గాంగే యుడు. తన తండ్రి అభీష్టం నెరవేర్చడానికి తనకు వారసత్వంగా వచ్చే రాజ్యాన్ని త్యజించడం, బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడం వల్ల దేవతలు పూలవర్షం కురిపించి ‘భీష్ముడు’ అని ప్రశంసించారు. భీష్ముడు నేర్పిన విజ్ఞానం ధర్మరాజుకు రాజ్యపాలనకు ఉపయోగ పడుతుందని భావించే శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి ప్రబోధానికి అవ కాశం కల్పించారు. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభూతం – అనే మూడు తత్త్వాలకు ఆధారమై, అందులోనే తానూ జీవిస్తూ కర్తా, భర్తా, హర్తా అనే భగవతత్త్వాన్ని గురించి వివరించాడు.
ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడే ద్రౌపది భీష్మునితో ”తాతా! ఇన్ని ధర్మసూత్రాలు
నీకు తెలుసుండి, ఆ రోజు నిండు సభలో దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేసి పరాభవిస్తుంటే ఎందుకు వారించ లేకపోయావు?” అని ప్రశ్నించింది. అపుడు భీష్ముడు బదులిస్తూ ”అమ్మా! పాంచా లి! నువ్వన్న మాట నిజమే. అయితే నేను అధర్మ పరాయణుల ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు, నా నోరు ధర్మం గురించి ఎలా మాట్లాడగలదు?” అన్నాడు. భీష్ముడు ఎంతటి మహాజ్ఞానో, అంతటి శ్రీకృష్ణుని భక్తుడు. శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు అంశే అని గ్రహంచిన వారిలో మొదటివాడు. శ్రీకృష్ణునిలో పరమాత్మ తత్త్వాన్ని గుర్తించిన యోగి. అందుకే ధర్మరాజుకు, సోదరులకు శ్రీకృష్ణుడిని ఒక మిత్రుడుగా భావించడంకంటే, ఆయనలో తత్త్వాన్ని గుర్తించమని విశిద పరుస్తాడు.
భీష్ముడి భావవ్యక్తీకరణ
ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే, శ్రీకృష్ణుడు భీష్ముడు వద్దకు వచ్చాడు. సాక్షాత్తు విష్ణువునే దర్శిస్తున్నట్లు తన్మయత్వం పొందాడు. ఆ వసుదేవుని దివ్య నామాలతో స్తుతించాడు. స్వచ్ఛంద మర ణం వరం ఉన్నా, స్వర్గానికి వెళ్ళడానికి శ్రీకృష్ణుని అనుమతి కోరాడు. అంపశయ్య మీద నుండే విష్ణు సహస్రనామాలను ఈ జగ త్తుకు అందించాడు. మోక్ష ధర్మానికి అర్థ, కామాలను త్యాగం చేసి కేవలం ధర్మమే మార్గంగా జీవించాడు భీష్ముడు. శ్రీకృష్ణుని అనుమతి కోరగానే, శ్రీకృష్ణుడు ”గంగాపుత్రా! వెళ్ళుటకు అనుమతిస్తున్నా ను. నీవు నీ తోటి వారైన వసువులను కలుసుకోమ”ని చెప్పాడు. అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు, ఇతర బంధువులను ఉద్దేశించి ”మీ చేత కూ డా అనుమతించబడ్డాను కదా” అంటూ వారందర్నీ ఆలింగనం చేసుకొన్నాడు.
భీష్ముడు ప్రాణాలను త్యజించిన విధానం
భీష్ముడు యోగధారణచేత మనసును నిగ్రహించి, ప్రాణా పానాది వాయువులను నియంత్రించి, ఒక్కొక్క అవయవము నుండి ఒక్కొక్క ప్రాణాన్ని తొలగించుకొంటూ ఉండగా, ఆ భాగా లన్నీ శల్యరహతాలయ్యాయి. భీష్ముని అన్ని అవయవాలు నిర్వీ ర్యం అయిన పిమ్మట, ఆత్మ శిరస్సుని ఛేదించుకొని, మిక్కిలి కాంతి తో ప్రకాశిస్తూ, ఆకాశంలో అంతర్థానమైపోయింది. అప్పుడు పై నుండి దేవతలు పూలవర్షం కురిపించారు. భీష్ములవారికి మాఘ శుద్ధ ఏకాదశి రోజు ఉత్తర క్రియలు ధర్మ రాజు, అతని సోదరులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ భీష్మఏకాదశిగా ప్రకటించి, మానవాళి అందరూ ఆయన బోధిం చిన ధర్మాచరణ, సత్యవచనం, కర్మ, జ్జాన మార్గాలను అనుసరిస్తూ భీష్మాష్టమి, భీష్మ ఏకాదశిని పాటిం చండని తెలిపాడు.