వ్యాయామంచేస్తున్నప్పుడుకాలినొప్పివస్తుందాకాళ్లలోమంటలు_ఉంటాయా?
అవగాహనాకోసం
శరీరంలో ఇతర భాగాల మాదిరిగా కాలిలో నొప్పికూడా ఒక నిర్మాణాన్ని ఆధారం చేసుకొని రావచ్చు. లేదా ఇతర భాగాల నుంచి జనించి కాలిలో ప్రస్ఫుటమవ్వచ్చు. నొప్పి ఎక్కడ నుంచి మొదలవుతుందనేది స్పష్టంగా చెప్పలేనప్పుడు లేదా స్పష్టమైన గాయంగాని, దేబ్బగాని లేనప్పుడు లక్షణాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే కారణాలు భోదపడతాయి. కాలు నొప్పికి స్పష్టమైన కారణమంటూ తెలిస్తే దానికి అనుగుణమైన చికిత్స తీసుకోడానికి వీలవుతుంది.
- #కండరాల_నొప్పి (మజిల్ క్రాంప్స్):
కాలి కండరాల్లో హఠాత్తుగా నొప్పి మొదలైనప్పుడు దానిని, ‘మజిల్ క్రాంప్స్’ అంటారు. ఆయుర్వేద పరిభాషలో ఈ నొప్పికి ‘పిండకోద్వేష్టనం’ అని పేరు. సాధారణంగా ఈ తరహా నొప్పి కాలి పిక్కల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని రకాల కనిజాలు, లవణాలు – ముఖ్యంగా కాల్షియం, పొటాషియం వంటివి తగ్గినప్పుడు క్రాంప్స్ ఏర్పడతాయి. ఈ కారణం చేతనే చాలామందికి ఆల్కహాల్ తీసుకున్న తరువాతగాని, విరేచనాలు అయిన తరువాత గాని కాళ్ల పిక్కల్లో నొప్పులు వస్తుంటాయి. అలాగే అలవాటు లేకుండా శారీరక శ్రమ చేసిన తరువాత గాని, ఎక్కువదూరాలు నడిచిన తరువాత గాని చాలా మందికి కాళ్ల నొప్పులు వస్తాయి, శారీరక శ్రమ చేసేటప్పుడు కాకుండా విశ్రాంతి తీసుకునే సమయంలో నొప్పులు వస్తాయి కాబట్టి వీటిని రెస్ట్ పెయిన్స్ అంటారు. దీనికి పరిష్కారంగా, నొప్పి వచ్చినప్పుడు కాలి వేళ్ళను పైవైపుకు వంచి, పిక్కలపైన మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అలవాటు లేని వ్యాయామాలను, శారీరక శ్రమలనూ చేయకూడదు. సరైన వార్మప్ లేకుండా వ్యాయామాలను మొదలెట్టకూడదు, కాఫీ, టీలను తగ్గించాలి. క్యాల్షియంనూ (పాల పదార్థాలు, పాలకూర, టమాట, గుడ్డు మొదలైనవి), పొటాషియంను (అరటి, కమలా, టమాటా తదితరలు) ఎక్కువగా తీసుకోవాలి.
ఔషధాలు: సింహ నాదగుగ్గులు,
వాతవిధ్వంసినీ రసం,
మహాయోగరాజు గుగ్గులు.
బాహ్యప్రయోగాలు – మహానారాయణ తైలం.
- #తుంటి_నొప్పి / గృద్రసీవాతం (సయాటికా):
సయాటికా నరం అనేది వెన్ను చివరి భాగం నుంచి బయలు దేరి పిరుదులు, తొడ పక్క భాగం, పిక్కలు మొదలైన ప్రదేశాల నుంచి ప్రయాణిస్తూ అరికాలు వరకూ వ్యాపిస్తుంది. సయాటిక్ నరం వాపునకు గురైనప్పుడు, ఇది ప్రయానించినంత మేరా నొప్పిగా అనిపిస్తుంది. సయాటికా నొప్పి సాధరణంగా వెన్నెముకలోని డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తుంది.
సలహాలు :
- శొంఠి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి.
- వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి.
- పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.
- ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, మహారాస్నాదిక్వాథం, సమీరాపన్నగ రసం, యోగరాజగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, అమృత భల్లాతక లేహ్యం, వాతగజాంకుశరసం.
https://omkaramfoundation.com/products/