వయసు పైబడిన వారిలో కాలునొప్పి ఉంటూ, దానితోపాటు మోకాళ్లు, కటి వలయం జాయింట్లలో కూడా నొప్పులు బాధిస్తుంటే దానిని జాయింట్లు అరగటం మూలంగా వచ్చిన ‘సంధివాతం’ గా అర్థం చేసుకోవాలి.
సూచనలు:
ప్రత్యేకమైన వ్యాయామాలను చేయడం, మహాయోగరాజగుగ్గులు వంటి వేదనాహర ఔషధాలను వాడాటం, వృత్తిరీత్యా చేయాల్సిన పనుల్లో మార్పులూ చేర్పులను చేసుకోవడంతో ఈ సమస్యను తేలికగా అదుపులో పెట్టుకోవచ్చు.
- #సిరలు_ఉబ్బటం (వేరికోస్ వీన్స్):
కాళ్లలో సిరలు నల్లగా, నీలం రంగులో మెలికలు తిరిగి ఉబ్బెత్తుగా కనిపిస్తుంటే, వాటిని ‘వేరికోస్ వీన్స్’ అంటారు. వీటి వల్ల కాలులో నొప్పి, అసౌకర్యాలు కలుగుతాయి. సిరల గోడలు సంకోచించగలిగే శక్తిని కోల్పోయినప్పుడు రక్తం స్థానికంగా సంచితమై, చుట్టుపక్కల నిర్మాణాలపైన ఒత్తిడిని కలిగించి నొప్పికి కారణమవుతుంది. పాదాలకు ప్రసారిణి తైలం అనే ఔషధ నూనెను రాసుకోవటం, ఎలాస్టిక్ సాక్స్ లను ధరించడం, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను వైద్య సలహాను అనుసరించి చేయడం ద్వారా ఈ స్థితిని చక్కదిద్దుకోవచ్చు.
ఔషధాలు: వృద్ధివాదివటి, అభయారిష్టం, అర్శకుఠార రసం, అర్శోఘ్నవటి, బోలపల్పటి, గుడూచిసత్వం, కుటజావలేహ్యం, లవణభాస్కర చూర్ణం, మహావాత విధ్వంసినీ రసం, పీయూషవల్లీరసం, ప్రాణదాగుటిక, సప్తవింశతిగుగ్గులు, త్రిఫలా గుగ్గులు, ఉసీరాసవం.
బాహ్యప్రయోగాలు – మహానారాయణ తైలం
- రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం (త్రాంబోసిస్):
ధూమపానంచేసే వారిలోను, సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళల్లోనూ, వ్యాయామరహిత జీవితం గడిపే వారిలోను సిరల్లో రక్తం గడ్డ కట్టి స్థానికంగా నొప్పికి, వాపునకూ కారణమవుతుంది. ఆయుర్వేదంలో ఈ స్థితిని ‘ఖవైగుణ్యం’ అంటారు. ‘ఖ’ అంటే స్రోతస్సులనీ లేదా మార్గాలనీ అర్థం.
సూచనలు: ఈ వ్యాధిలో జలౌకావచరణం (జలగలతో రక్త మోక్షణం చేయడం)తో పాటు సమీరపన్నగ రస, లశునక్షీరపాకం వంటి శక్తివంతమైన మందులు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
6.#రక్తనాళాలుబిరుసెక్కిసాగేగుణాన్నికోల్పోవడం (ఎథిరోస్క్లీరోసిస్):
రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ ఉన్న వారిలోను, సిగరెట్లు ఎక్కువగా తాగేవారిలోను ధమనుల లోపలి గోడలు పూడుకుపోయి కాలుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. దీని ఫలితంగా కణజాలాలకు ప్రాణవాయువు సరైన మోతాదులో అందక నొప్పి బయల్దేరుతుంది. ఇలా ఎక్కువగా కాళ్లలో జరుగుతుంటుంది. ఈ స్థితిలో ఒకవేళశక్తికి మించి శ్రమ చేసినా, వ్యాయామం చేసినా, ఆక్సిజన్ అవసరాలు మరింతగా పెరిగి, డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడంతో, తీవ్రమైన నొప్పి అనిపిస్తుంది. కాలువలలో రక్తనాళాలు (ధమనులు) పూడుకు పోయినప్పుడు చర్మంపై మార్పులు సంభవించడం, వెంట్రుకలు ఊడిపోవడం, చర్మం పాలిపోయి కనిపించడం, చర్మాన్ని తాకితే స్పర్శకు చల్లగా తగలడం, పాదాల వేళ్ల సందుల్లో తరచుగా ఇన్ఫెక్షన్లు రావటం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.
సలహాలు :
- వెల్లుల్లిపాయలు (ఇది గ్రాములు) తీసుకొని పైపొర తోఅలగించి లోపలి గర్భాలను మజ్జిగలో (కప్పు) ఆరుగంటల పాటు నానేయాలి. తరువాత కడిగి పాలలో (గ్లాసు) వేసి పావుగ్లాసు పాలు మాత్ర మిగిలేంతవరకు మరిగించాలి. దీనిని వదపోసుకుని అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకుని ప్రతిరోజూ రాత్రిపూట తాగాలి.
- కరివేపాకును ఎండబెట్టి పొడిచేసి అన్నంలోగాని, మజ్జిగలోగాని పూటకు చెంచాడు చొప్పున ప్రతిరోజూ రెండుపూటలా తీసుకోవాలి.
ఔషధాలు: లశునాదివటి,
నవకగుగ్గులు,
పునర్నవాదిగుగ్గులు,
మేదోహరవిడంగాది లోహం.
- #పౌష్టికాహారలోపం (మాల్ న్యూట్రిషన్):
సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొని వారిలో, బీ-కాంప్లెక్స్ లోపం ఏర్పడి కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, సూదులతో గుచ్చినట్లు నొప్పులూ అనిపించే అవకాశం ఉంది. ఆకు కూరల్లోను, తవుడులోనూ బీ- కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పదార్థాలను సమృద్ధిగా తీసుకోవాలి.
- #నరాల_సమస్యలు:
ఆల్కహాల్ తీసుకునే వారిలోను, మధుమేహం నియంత్రణలో లేని వారిలోనూ కాళ్ల లోపలుండే నరాలకు రక్తసరఫరా తగ్గి వాటిలోని న్యూరాన్ కణజాలాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా జరిగితే సూదులతో గుచ్చినట్లు నొప్పి మొదలై క్రమంగా పాదాలు మొద్దుబారటం, కండరాలు శక్తిని కోల్పోవడాలు జరుగుతాయి. దీనికి పరిష్కారంగా, మద్యపానాన్ని వదిలేయటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం మానేయటం, పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం చేయాలి. అలాగే కారణాన్ని అనుసరించి చికిత్స తీసుకోవాలి.
ఔషధాలు: క్షీరబలాతైలం (101 ఆవర్తాలు), మహావాత విధ్వంసినీ రసం,
లశునక్షీరపాకం, వాతగజంకుశరసం, స్వర్ణసమీరపన్నగ రసం,
వసంత కుసుమాకర ర
ధన్యవాదములు ?