యుర్వేదం నందు త్రివిధోపాయములు అనగా
* దర్శనము .
* స్పర్శ .
* ప్రశ్న .
పైన చెప్పిన మూడు విధాలుగా రోగిని పరీక్షించవలెను . వీటిని త్రివిధోపాయాలు అంటారు.
ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను .
- దర్శనము – నేత్రములతో రోగి యొక్క ఆకారము , నాలుక , కండ్లు , మలమూత్రాదులను పరీక్షించి రోగమును గుర్తించవలెను .
- స్పర్శ –
రోగి శరీరంను చేతితో తాకి నాడి , ఉష్ణత్వము , కడుపుబ్బరము మున్నగు వాటిని పరీక్షించి రోగము గురించి తెలుసుకొనవలెను .
- ప్రశ్న –
రోగిని ప్రశ్నించి నిద్ర , ఆకలి , బలము , తాపము , బరువు , శరీరము యొక్క మలమూత్ర ప్రవృత్తి మున్నగునవి తెలుసుకొనవలెను . స్త్రీలైనచో పైన చెప్పిన ప్రశ్నలతో పాటు ఋతుప్రవృత్తి , రుతుశూల , కుసుమాది రోగముల గురించి ప్రశ్నించి తెలుసుకొనవలెను . ఈ మూడు పరీక్షలు చేయనిచో వ్యాధి వైద్యుడను తప్పుదోవ పట్టించును. కావున మూడు పరీక్షలు సంపూర్ణముగా చేసి వ్యాధిని సరిగ్గా అంచనావేసి సరైన ఔషధం ఇవ్వవలెను .