శివాలయంలో సోమసూత్రం దాటవద్దంటున్నారు. అక్కడినుంచి వెనక్కు వెళ్లిపోమంటున్నారు. ఇది సరైనదేనా?

OMKARAM GURUJIAstrology

శివాలయంలో సోమసూత్రం దాటవద్దంటున్నారు. అక్కడినుంచి వెనక్కు వెళ్లిపోమంటున్నారు. ఇది సరైనదేనా?

0 Comments

శివలింగం నుంచి అభిషేక జలం కిందకు ప్రవహించే ఏర్పాటుకు సోమసూత్రం అని పేరు. ఈ సోమసూత్రాన్ని దాటే అవసరం గర్భాలయంలో అభిషేకం చేసేవారికే కాని, ఇతర భక్తులకు రానేరాదు. సోమసూత్రానికి చివర చండికేశ్వరుడు ఉంటాడు. పానవట్టానికి కిందుగా కానీ, గర్భాలయానికి బయట కానీ చండీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. సోమసూత్రం పరిధి అంతవరకే. చండీ ప్రదక్షిణలు చేసేవారు అక్కడివరకు వచ్చి చప్పట్లు కొట్టి చండీశ్వరుని ఆరాధిస్తారు. అక్కడినుంచి ధ్వజస్తంభం వద్దకు వెనక్కు వెళ్లి తిరిగి ప్రదక్షిణ కొనసాగిస్తారు. ఈ రకమైన ప్రదక్షిణ చేయడానికి తప్పనిసరిగా గురూపదేశం కావాలి. సోమసూత్రం దాటకూడని చోటు అంటే అభిషేక జలాలు పడేచోట కట్టిన చిన్న కుండీని దాటవద్దని మాత్రమే అని అర్థం. అంతేకానీ జలం ప్రవహించినంత దూరం నడవొద్దని మాత్రం కాదు. ప్రదక్షిణ మార్గంలో మిగిలిన భక్తులందరూ సోమసూత్రం వద్ద అభిషేక జలాన్ని శిరస్సుపై చల్లుకుని ముందుకు సాగిపోతుంటారు. శివాలయంలో ప్రదక్షిణలు ధ్వజస్తంభం నుంచి ధ్వజస్తంభం వరకూ లేదా నందినుంచి నందివరకూ చేయాలి. మూడు, ఆరు, తొమ్మిది, పన్నెండు ఇలా ప్రదక్షిణల సంఖ్య నిర్ణయించుకోవాలి. ప్రదక్షిణ తర్వాత శివదర్శనం చేసుకోవాలి. ఏకారణం చేతనైనా శివదర్శనం చేసుకోలేకపోతే ఆలయ శిఖరం లేదా ఆలయం పైన ఉండే కలశాలలో ఏదో ఒకదాన్ని దర్శించుకోవాలి. శివరాత్రినాడు ప్రదక్షిణలు చేయడానికి రాత్రి సమయం శ్రేష్ఠం. ఆరోజున చేసే ఒక ప్రదక్షిణ మిగిలిన సమయాల్లో చేసే వేయి ప్రదక్షిణలకు సమానం అని శివపురాణం స్పష్టం చేస్తోంది. Contact Omkaram Daily Tips 9059406999


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *