ఆయుర్వేదం నందు వ్యాధుల గురించి తెలుసుకొనుటకు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులు ద్వారా వ్యాధినిర్ధారణ చేయుటకు అనుభవం కూడా ప్రధానమైంది . ముందు అసలు ఆయా పద్దతుల గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను . సమస్త వ్యాధుల గురించి తెలుసుకోవడానికి 8 స్థానాలను మొదట పరీక్షించవలెను . అవి
- నాడి .
- స్పర్శ . ( తాకుట ) .
- రూపము .
- శబ్దము .
- నేత్రములు .
- పురీషము .
- మూత్రము .
- జిహ్వ ( నాలుక ) . ఈ 8 రకాల స్థానాలను ముందుగా పరీక్షించిన తరువాత మాత్రమే రోగనిర్ధారణ చేయవలెను . ఇప్పుడు మీకు ఒక్కొక్కదాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .
- నాడి – దీనిని ఆంగ్లము నందు Pulse అని పిలిచెదరు . చరక , సుశ్రుతాది గ్రంథముల యందు ఎక్కడ కూడా నాడీవిషయము చెప్పబడలేదు . అయినాకూడా రోగములను గుర్తించుటకు కాని , వాటికి చికిత్స చేయుటకు గాని ఈ నాడీపరిక్షే ప్రథమస్థానం ఆక్రమించుచున్నది . మనిషి యొక్క ఒక ఉచ్చ్వాస నిశ్వాసమునకు ( Respiration ) 4 సార్లు నాడి స్పందనము ( Beating of the pulse ) కలుగును . వయస్సును అనుసరించి నాడీ స్పందన – గర్భములో పిండము – నిమిషానికి – 150 – 130 . పుట్టగానే – నిమిషానికి – 140 – 130 . 1 సంవత్సరం లోపు – నిమిషానికి – 130 – 115 . 2 సంవత్సరాల లోపు – నిమిషానికి – 115 – 100 3 సంవత్సరాల లోపు – నిమిషానికి – 100 – 90 . 7 – 14 సంవత్సరాల వరకు – ” – 90 – 75 . 14 – 20 సంవత్సరాల వరకు – ” – 85 – 75 . 21 – 60 సంవత్సరాల వరకు – ” – 75 – 65 . 60 సంవత్సరాల పైన – ” – 85 – 75 . జీర్ణజ్వరము , రక్తక్షీణము , దౌర్బల్యము , భోజనానంతరం , మలవిసర్జన అనంతరం నాడి క్షీణించును . ఎంతవ్యాధి యున్నను వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు . నాడీస్పందన 150 సంఖ్య సమీపించిన అపాయము .