- వేసవికాలంలో మంచిరకం మరియు తియ్యటి మామిడిపండ్లు పూటకు ఒకటిచొప్పున రోజూ తినుచున్న త్వరలో శరీరంలో నీరసం పోవును .
- రోజుకో కొబ్బరిబోండం తాగుచూ అందులోని లేతకొబ్బరి తినుచున్న నీరసం పోయి బలం కలుగును.
- అప్పుడప్పుడు కొంచం దాల్చిన చెక్క బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుచున్నా శరీరం లొని నీరసం తగ్గును.
- రోజుకొకసారి నేలవేము సమూల కషాయాన్ని పావుకప్పు చొప్పున ప్రతినిత్యం తాగుచున్న నీరసం , నిస్సత్తువ హరించును . జబ్బు వలన శరీరం నీరసపడినవారు దీనిని వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి.
- రాత్రి సమయంలో నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక రాగిచెంబులో నానబెట్టి ఉదయాన్నే విత్తనాలు తీసివేసి ఆ ఖర్జూరాలు తిని ఆ రాగిచెంబులోని నీరు తాగుచున్న శరీరము నందలి నిస్సత్తువ హరించును .
- తుమ్మజిగురు ఉశిరికాయ అంత తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి కొంచం పంచదార చేర్చి ప్రతినిత్యం తాగుచున్న నీరసం పోయి బలం కలుగును.
- ప్రతినిత్యం పులవకుండా తియ్యగా ఉన్న తాటికల్లు ఒక గ్లాసు చొప్పున తీసుకొనుచున్న శరీరానికి మంచి పుష్టి కలుగును.