భైరవకీల లేదా #వజ్రకీల

OMKARAM GURUJIAstrology

భైరవకీల లేదా #వజ్రకీల

0 Comments

భైరవకీల లేదా #వజ్రకీల గురించి తెలుసుకుందాం…
ఈ “భైరవ కీల” లేదా “వజ్ర కీల” ను, వజ్రయాన తంత్రం లోనూ, కాపాలిక సాధనల్లోనూ ఉపయోగిస్తారు.
శివశక్తి మంత్ర సాధన #OmkaramGuruji9059406999 (సిద్దమంత్ర సాధనతో సకల కోరికలు నెరవేరుతాయి..)
ఇది మూడు వైపుల జారు అంచులు కలిగినది, దీనిని కఠినమైన కలపతో గాని, దంతంతో గాని తయారు చేస్తారు. ఇది చాలా ఖరీదైన తాంత్రిక ఉపకరణము. ఈ వజ్రకీల తయారీలో ఎంతో నైపుణ్యాన్ని కనబరుస్తారు. దీనిలో మూడు విభాగాలుంటాయి. ప్రతీ విభాగము, ఒక ప్రత్యేక రంగుతో చిత్రీకరించబడియుంటుంది. ఎరుపు, నలుపు, తెలుపు రంగులు.ఈ వజ్రకీలలో అంతర్గతంగా ఇమడ్చబడియున్న ఎముకతో దంతాలు, కోరలు తయారుచేయబడి ఉంటాయి. ఈ భైరవ కీలను, తాంత్రికులు నకారాత్మక స్పందనలకు ఎదురుగా నిలబెడతారు. నకారాత్మక స్పందనలను, సకారాత్మక స్పందనలుగా మార్చడానికి గాని ఈ వజ్రకీలను ఉపయోగిస్తారు. వజ్రయాన బౌద్ధంలో దీనిని…వజ్రయాన తాంత్రికంలో ఉపయోగిస్తారు. శక్తీకరించిన ఈ “వజ్ర కీల” లేదా “భైరవ కీల”ను Negative Forces ను వదలగొట్టడం లోనూ (భూత, ప్రేత, పిశాచ వైద్యం), వ్యాదుల నివారణలోనూ, శీతోష్ణ పరిస్థితుల ను నియంత్రించడంలోనూ ఉపయోగిస్తారు.

ఈ వజ్ర కీలను ఖరీదైన "నల్లమల చెక్క మరియూ దంతంతో" తయారు చేస్తారు.

ఈ వజ్రకీలలో కనిపిస్తున్న "బ్లేడ్" , మొసలి నోటి నుండి వస్తున్నట్లుగా కనిపిస్తునట్లుంది.

ఈ వజ్రకీల యొక్క ఇరుసు సంక్లిష్టతతో ముడులు వేయబడి, గుండ్రని కమలం లాంటి పట్టుతో ముడులు వేయబడి ఉంటుంది.ఈ వజ్రకీల క్రింది భాగం సర్పములతో చెక్కబడి ముడివేయబడినట్లుగా ఉంటుంది.

 ఈ "వజ్ర కీల", బౌద్ధ దేవతా గణాలలో ఒకడైన "వజ్రసత్వుని" ఆయుధం. ఈ వజ్ర సత్వుడు, బుద్ధుని యొక్క రౌద్ర శక్తి. ఈ వజ్రకీల మూడు ముఖములతో, భిన్న రంగులతో, శిరో భాగముపై మానవ కపాలాలతో ఒప్పారియుంటుంది.

ఈ వజ్రకీల, వజ్రపాణి యొక్క రౌద్రభావ ఆయుధం కూడా అంటారు. భారత దేశంలోనూ, టిబెట్టు లోనూ ఈ వజ్రకీలను రక రకాల తాంత్రిక ప్రక్రియలలో ఉపయోగిస్తారు.
#Omkaram-Bairava


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *